సైబర్ మోసాలపై అల్లూరి పోలీసుల హెచ్చరిక: టెలిగ్రామ్ ఫేక్ ఆఫర్లతో అప్రమత్తత
రిపోర్టర్: గోపి
స్థలం: అల్లూరి సీతారామరాజు
టెలిగ్రామ్ వేదికగా జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అల్లూరి పోలీసులు హెచ్చరించారు. నకిలీ పెట్టుబడి ఆఫర్లు, అధిక లాభాల ఆశలు చూపే ఫేక్ లింకులు మరియు తెలియని గ్రూపులను నమ్మి మోసపోవద్దని స్పష్టం చేశారు. వ్యక్తిగత అలాగే బ్యాంకు వివరాలను ఎవరికీ షేర్ చేయకూడదని సూచించారు. అత్యాశకు పోకుండా అప్రమత్తతతో ఉంటేనే మోసాల బారిన పడకుండా రక్షణ లభిస్తుందని అల్లూరి పోలీసులు వెల్లడించారు.