పోలీస్ శాఖకు ఎనలేని సేవలందించారన్న ఖమ్మం సీపీ సునీల్ దత్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఖమ్మం అర్బన్

ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ మరియు హోంగార్డ్ అధికారులకు ఖమ్మం సీపీ సునీల్ దత్ పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. బుధవారం నాడు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీపీ పాల్గొని మాట్లాడారు. సుదీర్ఘ కాలంగా వివిధ విభాగాలలో బాధ్యతయుతమైన విధులు నిర్వహించి శాఖకు సేవలందించారని తెలిపారు. విధినిర్వహణలో తోడ్పాటు అందించిన అధికారుల కుటుంబ సభ్యులను సీపీ ప్రత్యేకంగా అభినందించారు.