చేబ్రోలులో వైఎస్సార్సీపీకి గట్టి షాక్: టీడీపీలోకి భారీగా వలసలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: గుంటూరు
గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామంలోని పలు ప్రాంతాలకు చెందిన పలు వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరినట్లు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తెలిపారు. పాతరెడ్డిపాలెం, పాత మాల పల్లె, మొద్దు మాల పల్లె ప్రాంతాలకు చెందిన వీరందరికీ ఆయన స్వయంగా పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే తమ పార్టీలో చేరుతున్నారని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ స్పష్టం చేశారు.