పంజాబ్ ఎల్పీయూ యూనివర్సిటీలో విద్యార్థుల ఘర్షణలు మరియు తీవ్ర నిరసనలు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Jalandhar

పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ ఎల్పీయూ యూనివర్సిటీలో జరిగిన అత్యాచారం, ఆత్మహత్య ఉదంతాలపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలతో విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఆందోళనకు దిగినట్లు డిఐజి నవీన్ సింగ్లా తెలిపారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో విద్యార్థులు విధ్వంసం సృష్టించి భవనాలకు నిప్పు పెట్టడంతో పాటు జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేసి ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.