ఒంగోలులో మెప్మా అక్రమాలు వెలుగులోకి వచ్చి బాధితుల ఆందోళన

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: ప్రకాశం

ఒంగోలు కలెక్టరేట్ వద్ద మెప్మా అక్రమాలపై మహిళలు ఆందోళన చేపట్టారు. బోగస్ సంఘాల పేరుతో కొందరు ఆధార్ కార్డులు తీసుకొని రూ.లక్షలు రుణాలు స్వాహా చేశారని, బ్యాంకు నుంచి లీగల్ నోటీసులు రావడంతో అమాయక మహిళలు లబోదిబోమంటున్నారు. గతంలో కొందరిని సస్పెండ్ చేసినా రికవరీ లేకపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.