నిరుద్యోగులకు గుడ్ న్యూస్: తొలి ఉద్యోగంలో పదిహేను వేల రూపాయల ప్రోత్సాహకం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: New Delhi

మొదటి ఉద్యోగంలో చేరే యువతకు భారీ ఆర్థిక ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు Ministry of Labour and Employment, GoI వెల్లడించింది. ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్గార్ యోజన కింద తొలిసారిగా ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ అందుకుంటున్న అర్హులైన యువతకు పదిహేను వేల రూపాయల వరకు ప్రత్యేక ప్రోత్సాహక మొత్తాన్ని రెండు విడతలుగా నేరుగా అందజేయనున్నట్లు ఆ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.