హైదరాబాద్‌లో భారీ వర్షం బీభత్సం: నాలాలో పడిపోయిన ఫుడ్ డెలివరీ బాయ్ రక్షణ
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లోని విఠల్ రావు నగర్ సమీపంలో శుక్రవారం రాత్రి ఏకధాటిగా కురిసిన వర్షానికి నాలాలో పడిపోయిన అర్జున్ కుమార్ అనే ఫుడ్ డెలివరీ బాయ్‌ను పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు సురక్షితంగా కాపాడినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయని, నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో డెలివరీ బాయ్ బైక్‌ను మాత్రం ఇంకా బయటకు తీయలేకపోయినట్లు వెల్లడించారు. ప్రస్తుతం అర్జున్ కుమార్ క్షేమంగా ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు.