టెక్ ప్రియులకు గుడ్ న్యూస్: మార్కెట్లోకి ఒప్పో ఎఫ్35 ప్రో ఫోన్లు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Hyderabad
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో త్వరలో భారత మార్కెట్లోకి కొత్తగా తీసుకురానున్న ఎఫ్35 ప్రో 5జీ మరియు ఎఫ్35 5జీ మోడల్ ఫోన్లకు సంబంధించిన కీలక వివరాలు గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ ద్వారా వెల్లడయ్యాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అక్టోబర్ 5న భారత్లో విడుదల కానున్న ఈ రెండు ప్రీమియం స్మార్ట్ఫోన్లు అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ వేదికగా కొనుగోలుకు అందుబాటులో ఉంటాయని కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి.