'భూబకాసురుడు కేసీఆర్': మాజీ సీఎంపై మంత్రి పొంగులేటి తీవ్ర ఆరోపణలు
రిపోర్టర్: రమేష్
స్థలం: తెలంగాణ
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ను వేల కోట్ల విలువైన ఆస్తులు సంపాదించిన భూబకాసురుడిగా అభివర్ణించిన ఆయన, 2004 ఎన్నికల సమయానికి కనీసం ఒక్క ఎకరా భూమి లేని కుటుంబానికి పదేళ్ల పాలనలో వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కేసీఆర్ అఫిడవిట్లే వారి దోపిడీకి సాక్ష్యమని, అక్రమ ఆస్తులపై చట్టప్రకార చర్యలుంటాయని హెచ్చరించారు.