తిమ్మాపురం ప్రమాద బాధితులను పరామర్శించిన బీజేపీ నేత గురురాజ్ దేశాయ్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఎమ్మిగనూరు

ఎమ్మిగనూరు మండలం తిమ్మాపురంలో బైక్ ప్రమాదంలో గాయపడిన బీజేపీ సీనియర్ నాయకుడు పెద్దయ్య, ఆయన కుమారుడిని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గురురాజ్ దేశాయ్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఆర్థిక సహాయం అందించారు.

ఈ సందర్భంగా కార్యకర్తలకు బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వాహనాలు నడిపేటప్పుడు వేగం కంటే ప్రాణం ముఖ్యమని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.