పాలకుల కక్షసాధింపు చర్యలపై నిప్పులు చెరిగిన బీజేవైఎం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం నగరంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శాసనాల సాయిరాంను పోలీసులు తెల్లవారుజామున ముందస్తుగా అదుపులోకి తీసుకుని త్రీటౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి ఇంటెలిజెన్స్ నివేదికల పేరుతో బయటకు వెళ్లకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తున్న నాయకులను అక్రమంగా నిర్బంధించడం దారుణమని, పోలీసుల వేధింపులతో తమ పోరాటాలను ఆపలేరని స్పష్టం చేస్తూ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.