అక్రమంగా తరలుతున్న పిడిఎస్ బియ్యం లారీ పట్టివేత
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండల పరిధిలోని సింగారం గ్రామం వద్ద పోలీసులు, విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో భారీగా అక్రమ పిడిఎస్ బియ్యం పట్టుబడింది. లారీలో అక్రమంగా తరలిస్తున్న మూడు వందల ఇరవై నాలుగు క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై రాజాపేట ఎస్ఐ తఖీయుద్దీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన.... అక్రమంగా పిడిఎస్ బియ్యంను, తరలించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు.