మురసు తుఫాను ముప్పు: తమిళనాడు సీఎంను సహాయం కోరిన చంద్రబాబు

రిపోర్టర్: వెంకట్ స్థలం: Andhra Pradesh

మురసు తుపాను హెచ్చరికల నేపథ్యంలో సహాయ పునరావాస కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ కోసం తమిళనాడు సీఎం విజయ్ కు ఫోన్ చేసి ప్రత్యేక సహాయం కోరారు. తుపాను వల్ల దెబ్బతినే విద్యుత్ పోల్స్ పునరుద్ధరణకు సిబ్బందిని, యంత్రాలను పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం పూర్తిగా సన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేసినట్లు CMO ఆంధ్రప్రదేశ్ వెల్లడించింది.