అమెరికాలో ప్రముఖ మోడల్ కుమారుడు ప్రెస్లీ గెర్బర్ మృతి
రిపోర్టర్: సురేష్
స్థలం: అమెరికా
ప్రముఖ సూపర్ మోడల్ సిండి క్రాఫోర్డ్, వ్యాపారవేత్త రాండే గెర్బర్ ల ఏకైక కుమారుడు ప్రెస్లీ గెర్బర్ తన 27 ఏళ్ల వయసులో కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలో ఉన్న రిహాబిలిటేషన్ కేంద్రంలో కన్నుమూశారు. సెప్టెంబర్ 20న ఉదయం ఆయన తుదిశ్వాస విడిచినట్లు లాస్ ఏంజెల్స్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ రికార్డులు వెల్లడించాయి. మాదకద్రవ్యాల అధిక మోతాదు లేదా డ్రగ్స్ ఓవర్డోస్ కారణంగానే ఆయన మృతి చెంది ఉంటారనే అనుమానంతో శాంటా మోనికా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.