మెగా డీఎస్సీ అత్యంత పారదర్శకంగా నిర్వహించాం: అధికారుల స్పష్టీకరణ
రిపోర్టర్: విజయ్
స్థలం: అమరావతి
మెగా డీఎస్సీ-2025 ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా, శాప్ ఎండీ భరణి స్పష్టం చేశారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన వారు, స్పోర్ట్స్ కోటాలో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. నిరాధార ఆరోపణలు చేస్తూ ఉపాధ్యాయులను బెదిరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కోర్టు పరిధిలోని అంశాలపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు.