వెండితెరపై మరోసారి ప్రభుదేవా-సిమ్రాన్ మ్యాజిక్: కమల్ శ్రీదేవిగా రయ్రయ్

రిపోర్టర్: సురేష్ స్థలం: చెన్నై

దాదాపు ఇరవై ఏడేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రముఖ నటుడు ప్రభుదేవా, నటి సిమ్రాన్ జంటగా ఓ కొత్త తమిళ చిత్రంలో నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. కృష్ణానంద్ కొట్టారపట్టు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు కమల్ శ్రీదేవి అనే ఆసక్తికరమైన టైటిల్ ఖరారు చేసినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. సౌందర్య రజనీకాంత్ జియాన్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ కుటుంబ కథా చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.