మొబైల్ చోరీ చేసి ఆసుపత్రి మూడో అంతస్తు నుండి దూకి వ్యక్తి మృతి

రిపోర్టర్: వెంకట్ స్థలం: హర్యానా

హర్యానా రాష్ట్రం సోనిపట్ సివిల్ ఆసుపత్రిలో మహిళా రోగి మొబైల్ ఫోన్ చోరీ చేసి పారిపోతుండగా, పట్టుబడతామన్న భయంతో మూడో అంతస్తు నుంచి దూకిన ముప్పై ఏళ్ల యువకుడు తీవ్ర గాయాలతో మృతి చెందాడు. మెడికల్ వార్డులో చికిత్స పొందుతున్న ప్రీతి అనే మహిళ నిద్రిస్తున్న సమయంలో ఆమె ఫోన్ కాజేసి పారిపోతుండగా సిబ్బంది వెంబడించడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.