అఫ్గానిస్తాన్‌లో మళ్లీ అల్-ఖైదా ఉగ్రవాద శిక్షణ శిబిరాలు!

రిపోర్టర్: గోపి స్థలం: World

అఫ్గానిస్తాన్‌లో గత మూడేళ్లలో కనీసం ఎనిమిది ఉగ్రవాద శిక్షణ శిబిరాలను అల్-ఖైదా మరియు దాని అనుబంధ సంస్థలు ఏర్పాటు చేశాయి. డ్రోన్లు, కృత్రిమ మేధస్సుతో సహా గెరిల్లా యుద్ధంపై ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. 14 ప్రావిన్సుల్లో ఈ ఉగ్రమూకలు పాతుకుపోయాయి. తాలిబాన్లు మాత్రం ఉగ్రవాద కార్యకలాపాలను అనుమతించడం లేదని కొట్టిపారేస్తున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.