ఇన్‌స్టా రీల్స్ చూసి యూట్యూబర్ మధుమిత ఇంట్లో చోరీ చేసిన నిందితులు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: తమిళనాడు
తమిళనాడులో ప్రముఖ యూట్యూబర్ మధుమిత ఇంట్లో జరిగిన చోరీ కేసులో నిందితులను అరెస్టు చేసి విచారించిన పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. సోషల్ మీడియాలో నగలు, డబ్బు ప్రదర్శిస్తూ ఆమె చేసే ఇన్‌స్టా రీల్స్ చూసి ఆకర్షితులమై ఈ చోరీకి పాల్పడినట్లు నిందితులు అంగీకరించారని పోలీసులు తెలిపారు. తన ఇంట్లో దొంగతనం చేయడం ఎవరికీ సాధ్యం కాదని ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలను సవాల్‌గా తీసుకుని ఈ దురాగ్యానికి ఒడిగట్టినట్లు వారు విచారణలో స్పష్టం చేసినట్లు వివరించారు.