ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన సురుచి ఇందర్ సింగ్
రిపోర్టర్: కిరణ్
స్థలం: New Delhi
ఆసియా క్రీడల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్కు చెందిన సురుచి ఇందర్ సింగ్, కమల్జీత్ జోడీ స్వర్ణ పతకం సాధించినట్లు అధికారులు వెల్లడించారు. వ్యక్తిగత విభాగంలో వైఫల్యం ఎదురైనప్పటికీ, కేవలం నూతన ఆలోచనలతో పుంజుకుని రికార్డు స్ధాయిలో 484.6 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచామని సురుచి పేర్కొన్నారు. తల్లిదండ్రులు, కోచ్ సహకారంతోనే ఈ ఘనత సాధించామని తెలిపారు.