కెనడాపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం, అత్యంత చెడ్డ దేశమంటూ వ్యాఖ్య
రిపోర్టర్: కృష్ణ
స్థలం: World
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వాషింగ్టన్ వ్యవహారాలకు కెనడా అత్యంత కష్టమైన, చెడ్డ దేశమని విమర్శించారు. కెనడా నాయకులతో చర్చలు జరపడం చాలా కష్టమని ఆరోపించారు. జనవరి 1 నుంచి కార్లపై కొత్త సుంకాలు అమలులోకి వస్తాయని హెచ్చరించారు. గత కొነేళ్లుగా కెనడా అమెరికాను మోసం చేస్తోందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.