యూఏఈ అధ్యక్షుడితో ప్రధాని మోదీ ఫోన్ కాల్ సంభాషణ
రిపోర్టర్: రమేష్
స్థలం: న్యూఢిల్లీ
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి 76వ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పశ్చిమాసియా ప్రాంత పరిణామాలపై చర్చించడంతో పాటు భారత్-యూఏఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై మాట్లాడుకున్నారు.