తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు
రిపోర్టర్: కిరణ్
స్థలం: తిరుపతి
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలతో పాటు తిరుపతిలోనూ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. కలెక్టర్, ఎస్పీలతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.