స్టాక్ మార్కెట్లలో భారీ లాభాలు: సెన్సెక్స్, నిఫ్టీ దూకుడు
రిపోర్టర్: రాజేష్
స్థలం: Mumbai
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో దూసుకుపోయాయని ఆర్థిక నిపుణులు వెల్లడించారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పడిపోవడం మరియు అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు ఒక్కసారిగా జంప్ చేశాయి. ప్రారంభంలోనే సుమారు పదమూడు వందల పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్, మదుపర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. విదేశీ సంస్థాగత మదుపర్లు భారత్ మార్కెట్లలో భారీగా పెట్టుబడులు పెడుతుండటం గమనార్హం.