న్యాయ వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఎంతో మేలని వెల్లడి

రిపోర్టర్: హరి స్థలం: విజయనగరం

జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా న్యాయస్థానంలో మధ్యవర్తిత్వంపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయమూర్తి ఎం. బబిత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మధ్యవర్తిత్వ ప్రక్రియ చాలా సులువైనదని, దీనివల్ల ఎలాంటి ఖర్చు ఉండదని ఆమె తెలిపారు. దేశవ్యాప్తంగా తొంబై రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రమాద బీమా, గృహ హింస, చెక్ బౌన్స్ కేసులను దీనిద్వారా సులువుగా పరిష్కరించుకోవచ్చని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, ఉద్యోగులు పాల్గొన్నారు.