జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా బి. చెంగల్ రాజు ఎంపిక
రిపోర్టర్: RAVI BABU
స్థలం: వెదురుకుప్పం
విద్యా రంగంలో 31 సంవత్సరాల విశేష సేవలకు గుర్తింపుగా కత్తెరపల్లె పీఎం శ్రీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి. చెంగల్ రాజు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. వివిధ హోదాల్లో సేవలందిస్తూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఆయన చేసిన కృషి అభినందనీయం.
బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే కత్తెరపల్లె పాఠశాలలో మౌలిక వసతులు, విద్యా ఫలితాలను మెరుగుపరిచారు. ఈ అవార్డు దక్కడం పట్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.