'సంబంధం కొనసాగించకపోతే భర్తకు చెబుతానంది.. అందుకే హత్యచేశా': విజయనగరం ఎస్పీ దామోదర్

రిపోర్టర్: గోపి స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో లంకలపల్లి బంగారుబాబు అనే నిందితుడు మహిళను దిండుతో ముక్కు, నోరు నొక్కి దారుణంగా హత్య చేసినట్లు ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ బుధవారం విజయనగరంలో మీడియాకు వెల్లడించారు. మృతురాలితో నాలుగేళ్లుగా సంబంధం ఉన్న నిందితుడు, ఆమె దూరం పెడుతుందన్న కక్షతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీలు ఎస్‌.రాఘవులు, పీవీవీ.నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.