వైభవ్‌ దూకుడుతో తిలక్‌ లేదా దూబే జట్టుకు దూరం కానున్నారన్న కైఫ్‌

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: న్యూఢిల్లీ

భారత టీ20 జట్టులో చోటు దక్కించుకునేందుకు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తీవ్రంగా పోటీపడుతున్నాడని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ జోస్యం చెప్పారు. రాబోయే ఆరు నెలల్లో తుది జట్టులో చోటు కోసం తిలక్ వర్మ లేదా శివమ్ దూబేలో ఒకరు తప్పుకోవాల్సి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. వైభవ్ అద్భుతమైన ఫామ్‌తో పాటు బౌలింగ్ నైపుణ్యాలను కూడా మెరుగుపరుచుకుంటున్నాడని, ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ అదరగొడుతున్నాడని కైఫ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నారు.