టాలీవుడ్ సంచలనం: సూర్య సినిమా కోసం అడిగినా టైటిల్ ఇవ్వని విశ్వక్ సేన్
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించబోయే భారీ సినిమా కోసం తమ ‘CULT’ టైటిల్‌ను అడిగినప్పటికీ ఇవ్వలేదని టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ స్వయంగా వెల్లడించారు. తమ సినిమా కథకు ఆ టైటిల్ అత్యంత సరిగ్గా సరిపోతుందని భావించి సూర్య టీమ్ కోరినప్పటికీ, తన పాత్రకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుందన్న నమ్మకంతో సున్నితంగా నిరాకరించినట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఆసక్తికర విషయం సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.