ఆరోగ్యానికి చేపలు ఎంత మేలు: అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడించిన డాక్టర్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తెలంగాణ

చేపలు క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలతో పాటు ఇతర కారణాల వల్ల వచ్చే మరణాల ముప్పు తగ్గుతుందని అమెరికన్ సొసైటీ ఫర్ న్యూట్రిషన్ జర్నల్ అధ్యయనం తేల్చిందని ఆస్టర్ వైట్ఫీల్డ్ హాస్పిటల్ చీఫ్ క్లినికల్ డైటీషియన్ డాక్టర్ వీణా వి వెల్లడించారు. అయితే కేవలం చేపలు తినడం వల్లే ఆయుష్షు పెరిగిపోతుందని భావించరాదని, వండే విధానం మరియు పాదరసం లేని నాణ్యమైన చేపలను ఎంచుకోవడం చాలా ముఖ్యమని ఆమె స్పష్టం చేశారు.