రేణిగుంటకు చేరుకున్న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: రేణిగుంట
తిరుపతి, నెల్లూరు జిల్లాలలో ఒకరోజు పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారికి రాష్ట్ర వైద్య శాఖామాత్యులు సత్యకుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీవో భానుప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్యే ఆర్గాని శ్రీనివాసులు తదితరులు పాల్గొని సీఎంకు స్వాగతం తెలిపారు. అనంతరం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి హెలికాప్టర్లో నెల్లూరు జిల్లా వెంకటాచలంకు బయలుదేరి వెళ్లారు.