భారత్ జపాన్ టీ20 మ్యాచ్ కు తుఫాన్ ముప్పు
రిపోర్టర్: అశోక్
స్థలం: జపాన్
జపాన్లో దుజువాన్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తుండటంతో టోక్యో వేదికగా భారత్, జపాన్ మధ్య జరగాల్సిన చారిత్రాత్మక తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్కు తీవ్ర వర్షం ముప్పు పొంచి ఉంది. ఇరు దేశాల మధ్య 75 ఏళ్ల స్నేహాన్ని పురస్కరించుకుని ఈ మ్యాచ్ నిర్వహిస్తుండగా, తుఫాన్ కారణంగా భారత జట్టు ప్రాక్టీస్ సెషన్ రద్దయింది. మంగళవారం జరిగే ఈ మ్యాచ్కు భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.