గుండా మల్లేష్ ఆదర్శాలను కొనసాగించాలి: బెల్లంపల్లిలో ఘనంగా వర్ధంతి
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ గుండా మల్లేష్ ఆరో వర్ధంతిని సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. పేదల సమస్యలపై గుండా మల్లేష్ నిరంతరం పోరాడారని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి గుండా సరోజనతో పాటు పలువురు ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఘన నివాళులు అర్పించారు.