రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ను కలిసిన జడ్పీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు
రిపోర్టర్: అశోక్
స్థలం: రాజాం
రాజాం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ను జడ్పీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు రాజాంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామిని అవుతానని, స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా జెండా ఎగరడం ఖాయమని శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో బాధ్యతగా పనిచేయాలని ఎమ్మెల్యే మురళీమోహన్ పార్టీ శ్రేణులకు సూచించారు.