'ప్రభుత్వ భూమి తేలితే పేదలకే పంచుతాం': కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

రిపోర్టర్: మహేష్ స్థలం: సిద్దిపేట

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెందిన సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిధిలోని భూములపై సమగ్ర విచారణకు సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఫామ్‌హౌస్ ఆధీనంలో ఉన్న వందల ఎకరాల భూమిలో దాదాపు 340 ఎకరాలు ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందనే ఆరోపణలపై 30 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఒకవేళ అది ప్రభుత్వ భూమిగా తేలితే వెంటనే స్వాధీనం చేసుకుని, ఎర్రవెల్లి ఫాంహౌస్ వద్ద నిరసన తెలిపిన దళితులకు, పేదలకు పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.