బందమామిడి పాఠశాలలో మధ్యాహ్న భోజనం అందక విద్యార్థుల ఇబ్బందులు.. తక్షణమే స్పందించాలని తల్లిదండ్రుల వేడుకోలు
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: పెదబయలు
పెదబయలు మండలం కుంతుర్ల పంచాయతీ పరిధిలోని బందమామిడి పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెట్టడం లేదన్న ఆరోపణలు తీవ్రంగా వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా చిన్నారులు రోజూ ఇంటి నుంచే భోజనం క్యారేజీల్లో తీసుకెళ్లాల్సి వస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పాఠశాలలో భోజన వసతిని పునరుద్ధరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.