ఆయిల్ పామ్ మరియు వెదురు సాగుపై రైతన్నలకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సులు!

రిపోర్టర్: Srinivasarao Ummidisetti స్థలం: కిర్లంపూడి

ఏలేశ్వరం మండలం మర్రివీడు, తూర్పులక్ష్మీపురం, తిరుమాలి గ్రామాల్లో గురువారం ఉద్యాన అధికారిణి కె. దివ్యశ్రీ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ యాజమాన్యం, సస్యరక్షణ, యాంత్రీకరణ, వెదురు సాగుపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. జిల్లా ఉద్యాన అధికారి టి. వీర సిరిల్ మాట్లాడుతూ ఆయిల్పామ్ సాగుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ చల్లా వెంకట నరసింహారావు వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల సాగును వివరించారు.MPP గొల్లపల్లి నరసింహమూర్తి, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.