అనంతపురం జిల్లాలో ఉన్మాది హేమంత్ పై పోలీసుల కాల్పులు: తీవ్ర గాయాలు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆత్మకూరు అటవీప్రాంతంలో తలదాచుకున్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయేందుకు యత్నించాడని, దీంతో ఆత్మరక్షణ కోసం ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్ లో నిందితుడికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ దారుణ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.