భక్తిశ్రద్ధలతో కుమ్మరవీధి వినాయక మండపంలో ఘనంగా అన్నదానం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: చిట్వేల్
తిరుపతి జిల్లా చిట్వేలి టౌన్ పరిధిలోని కుమ్మరవీధి వినాయక మండపం వద్ద నాల్గవ రోజు వేడుకల్లో భాగంగా పెయింట్ కాంట్రాక్టర్ ఆలిశెట్టి పెంచలయ్య కుటుంబ సభ్యులు ఘనంగా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు నాలుగు వందలకు పైగా భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని గణనాథుడిని కోరుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.