కాకినాడ శ్యామ్ ఇనిస్టిట్యూట్‌లో పోలీసుల తనిఖీలు కలకలం
రిపోర్టర్: మహేష్
స్థలం: కాకినాడ
కాకినాడ కలెక్టరేట్ వద్ద మెగా పోలీస్ నోటిఫికేషన్ అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో శ్యామ్ ఇనిస్టిట్యూట్‌లో వన్‌టౌన్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆందోళనకు ఇనిస్టిట్యూట్ నిర్వాహకులే కారణమనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ధర్నాతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కుట్రపూరితంగా కేసులు పెట్టారని ఛైర్మన్ శ్యామ్ కన్నీటి పర్యమంతమయ్యారు. అభ్యర్థులు ప్రలోభాలకు గురై ఆందోళనలు చేయొద్దని హోంమంత్రి అనిత సూచించారు.