విజయనగరం జిల్లాలో విషాదం: వేర్వేరు ఘటనల్ లో చెరువులో పడి ఇద్దరు మృతి
రిపోర్టర్: సురేష్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లాలో జరిగిన వేర్వేరు ఘటనల్ లో చెరువులో పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారని పోలీసులు తెలిపారు. విజయనగరం మండలం సుంకరిపేట గ్రామానికి చెందిన బొడ్డు సంతోష్‌కుమార్ చెరువులో పడి ప్రాణాలు కోల్పోగా, లక్కవరపుకోట మండలం గేదెలవానిపాలెం గ్రామానికి చెందిన దివ్యాంగుడు గేదెల మనోజ్ చెరువులో జారిపడి మరణించారు. ఈ రెండు ప్రమాదాలతో ఆయా కుటుంబాల్ లో తీవ్ర విషాదం నెలకొందని, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.