అంతర్జాతీయ కరాటే పోటీల్లో కాంస్యం సాధించిన సత్యతేజ

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: Hyderabad

జోర్డాన్లోని అమ్మాన్లో జరిగిన ఏకేఎఫ్ 24వ జూనియర్ అండ్ యూ21 ఛాంపియన్షిప్లో తెలంగాణ కరాటే క్రీడాకారిణి బ్రహ్మదండి సత్యతేజ కాంస్య పతకం సాధించారు. అంతర్జాతీయ వేదికపై అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేసిన సత్యతేజను హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఘనంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారిణిని ప్రత్యేకంగా సత్కరించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.