తెలంగాణలో ఇబ్బందికరంగా మారిన ఇరవై రెండు ఏ భూముల సమస్య
రిపోర్టర్: విజయ్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో ఇరవై రెండు ఏ భూముల సమస్య లక్షలాది మంది ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఎన్వోసీలు సామాన్యులకు అంత తేలికగా రావడం లేదని ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్ శివారులోని బీఎన్ రెడ్డి నగర్, ఎల్బీ నగర్ ప్రాంతాలలో వేలాది ఇండ్లు, ప్లాట్లు నిషేధిత జాబితాలో ఉండటంతో ఆస్తుల అమ్మకాలు నిలిచిపోయాయి. తహసీల్దార్ల చుట్టూ తిరిగినా క్లియరెన్స్ రాక యజమానులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ జటిలమైన సమస్యను గుర్తించి వెంటనే పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు.