యూపీఐ వినియోగదారులకు భారీ ఊరట: దీపావళి వరకు ఎండీఆర్ ఛార్జీల వాయిదా

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

డిజిటల్ చెల్లింపులు నిర్వహించే వ్యాపార వర్గాలకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముఖ్యమైన గుడ్ న్యూస్ వెల్లడించింది. యూపీఐ మర్చంట్ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ అమలును దీపావళి వరకు వాయిదా వేస్తున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. పండుగ సీజన్ దృష్ట్యా వ్యాపారుల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రస్తుతానికి అదనపు భారం తప్పుతుందని వర్గాలు వెల్లడించాయి.