నెల్లూరు రవాణా శాఖలో దరఖాస్తుల పెండింగ్: తీవ్ర అవస్థలు పడుతున్న వాహనదారులు
రిపోర్టర్: కిరణ్
స్థలం: నెల్లూరు
నెల్లూరు రవాణా శాఖ కార్యాలయంలో సేవలు అందక వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్వర్ మరియు వెబ్సైట్ సమస్యల కారణంగా ఆర్సీ మార్పిడి తదితర పనులకు నెలల తరబడి సమయం పడుతోందని వారు వాపోయారు. అయితే ప్రస్తుతం ఎలాంటి సర్వర్ సమస్య లేదని, నూతన యాప్ను వినియోగించుకోవాలని రవాణా శాఖ ఉప కమిషనర్ బి.చందర్ స్పష్టం చేశారు.