గుజరాత్‌లో సోమనాథాలయం, బీజేపీ కార్యాలయానికి బాంబు బెదిరింపులు

రిపోర్టర్: గోపి స్థలం: అహ్మదాబాద్

గుజరాత్‌లోని ప్రముఖ సోమనాథాలయం మరియు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం కమలంతో పాటు పలు కీలక ప్రాంతాలను పేల్చివేస్తామంటూ వచ్చిన అజ్ఞాత ఇమెయిల్‌తో రాష్ట్రంలో కలకలం రేగింది. పంజాబ్ పోలీసుల ద్వారా అందిన ఈ హెచ్చరికలతో అప్రమత్తమైన భద్రతా దళాలు, బాంబ్ స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్‌లతో అహ్మదాబాద్, గాంధీనగర్‌లోని పలు ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టాయి. అయితే సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.