విజయవాడలో భారీ సైబర్ మోసం: షోరూమ్ డైరెక్టర్‌గా నమ్మించి కోటీ నలభై లక్షలు లూటీ
రిపోర్టర్: రమేష్
స్థలం: విజయవాడ
విజయవాడ శివారులోని ఓ కార్ల షోరూమ్‌లో అకౌంట్స్ మేనేజర్‌ను మోసగాళ్లు ఏమార్చారు. వాట్సాప్‌కు వచ్చిన ఏపీకే ఫైల్ ద్వారా ల్యాప్‌టాప్‌ను హ్యాక్ చేసి, షోరూమ్ డైరెక్టర్ డీపీని వాడుతూ కేటుగాళ్లు రూ.1.40 కోట్లు బదిలీ చేయించుకున్నారు. ఈ మోసంపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అకౌంట్స్ మేనేజర్ నిర్లక్ష్యం, వాట్సాప్ హ్యాకింగ్ కారణంగా ఈ భారీ మోసం జరిగినట్లు అధికారులు తెలిపారు.