'దమ్ముంటే డిస్ క్వాలిఫై చేయండి': అసెంబ్లీ వేదికగా మహేశ్వర్ రెడ్డి సవాల్

రిపోర్టర్: కృష్ణ స్థలం: Hyderabad

తెలంగాణ అసెంబ్లీ వేదికగా బీజేపీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 22A లో తప్పు చేసింది అధికారులా? ప్రభుత్వమా? అని నిలదీశారు. ఫోరెన్సిక్ ఆడిట్ ఎందుకు గల్లంతైందని ప్రశ్నించిన ఆయన, దమ్ముంటే డిస్ క్వాలిఫై చేయాలని సవాల్ విసిరారు. స్పీకర్ దూషణ వెనక అసలు దోషులు ఎవరో తేలాల్సిందేనని డిమాండ్ చేశారు.