గిరిశిఖర గ్రామాల్లో డోలీ మోతలు: ఎనిమిది కిలోమీటర్లు నడిపిన వైనం
రిపోర్టర్: అశోక్
స్థలం: శృంగవరపుకోట
శృంగవరపుకోట మండలంలోని కురిడి గ్రామానికి చెందిన వృద్ధురాలు మజ్జి సన్నమ్మ అనారోగ్యం పాలవడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఎనిమిది కిలోమీటర్ల దూరం డోలీలో మోసుకెళ్లారు. గిరిశిఖర ప్రాంతాల్లో డోలీ మోతల సంస్కృతి ఇంకా కొనసాగుతూనే ఉందని, గర్భిణులు, వృద్ధుల ప్రాణాలు కాపాడుకోవడానికి పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయని ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మంజూరైన రోడ్ల నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు.