ఆదిత్య థాకరేకు ఐదు వందల కోట్ల పరువు నష్టం నోటీసు ఇచ్చిన సతీష్ సాలియన్

రిపోర్టర్: సతీష్ స్థలం: ముంబై

దిశ సాలియన్ తండ్రి సతీష్ సాలియన్ శనివారం ముంబైలో శివసేన ఉద్ధవ్ థాకరే వర్గ అధినేత ఉద్ధవ్ థాకరే నివాసం మాతోశ్రీకి వెళ్లి ఆదిత్య థాకరేపై ఐదు వందల కోట్ల రూపాయల పరువు నష్టం నోటీసును అందజేశారు. దిశ మృతి కేసుకు సంబంధించి ఆదిత్య థాకరే తనను అప్రతిష్టపాలు చేశారని సతీష్ సాలియన్ ఆరోపించగా, ఆయన వెనుక నుండి ఎవరో నడిపిస్తున్నారని శివసేన నేత సంజయ్ రౌత్ తీవ్రంగా విమర్శించారు.